Homeట్రేండింగ్PF ఉన్నవారికి డబుల్ ధమాకా.. ఇక 90 శాతం డబ్బులు తీసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్..

PF ఉన్నవారికి డబుల్ ధమాకా.. ఇక 90 శాతం డబ్బులు తీసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్..

  • ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్
  • పీఎఫ్ ఖాతాదారులకు పండగే..
  • కొత్త విత్‌డ్రా రూల్స్‌తో భారీ ఊరట

ఉద్యోగం మానేసిన 2 నెలలకే ఫుల్ సెటిల్మెంట్ : 
నిరుద్యోగులైన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం ఊరటనివ్వనుంది. గతంలో ఉద్యోగం మానేసిన తర్వాత పూర్తి పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి 12 నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గడువును మళ్లీ 2 నెలలకు తగ్గించారు. అంటే.. ఉద్యోగం మానేసి వరుసగా 2 నెలలు నిరుద్యోగిగా ఉన్న తర్వాత నిబంధనల ప్రకారం పూర్తి పీఎఫ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు..

రిటైర్మెంట్ తర్వాత నెలనెలా డబ్బులు :
ఇక రిటైర్మెంట్ చేసినవారికి కూడా ఈపీఎఫ్ఓ మరో మంచి అవకాశం కల్పించనుంది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా నెలవారీ, 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి వాయిదాల రూపంలో తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వర్తించే పీఎఫ్ వడ్డీ కొనసాగుతుంది..

అయితే, ఈ మార్పులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, అమలు మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈపీఎస్ కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మొత్తంగా ఈ కొత్త నిర్ణయాలు పీఎఫ్ ఖాతాదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments