ఏపీకి తప్పిన అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. ఇచ్ఛాపురం వైపు అక్వాన్ దిశ మార్పు!

Must read

  • ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్ దిశ మార్పు
  • తీరానికి చేరే కొద్దీ తగ్గనున్న తుఫాన్ తీవ్రత
  • బలహీనపడుతున్న అక్వాన్ తుఫాన్
  • ఇచ్ఛాపురం దగ్గర తీరం దాటే ఛాన్స్

గాలుల వేగం కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉండటంతో భారీ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రానికి ఉపశమనం లభించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ముప్పు పూర్తిగా తొలగిపోయిందని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని అంటున్నారు.

పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు :
ఉత్తర కోస్తాంధ్రలోని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేస్తున్నారు.

వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా తుఫాన్ దిశ, తీవ్రతలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి వెల్లడించారు. అక్వాన్ తుఫాన్ తీవ్రత తగ్గే సూచనలతో ఏపీకి కొంత ఊరటనిచ్చే విషయమే అయినా తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరమని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!