బట్టతల బాధితులకు సూపర్ గుడ్ న్యూస్.. చైనా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి ‘ఎలక్ట్రిక్ దువ్వెన’.. కేవలం 28 రోజుల్లోనే దట్టమైన జుట్టు

Must read

China Electric Comb: ఆధునిక వైద్య, సాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, బట్టతలపై సహజసిద్ధంగా తిరిగి జుట్టు మొలిపించే శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బట్టతల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న వారికి చైనాలోని బీహాంగ్ (Beihang) విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక అద్భుతమైన శుభవార్తను అందించారు. నున్నటి తలపై కూడా నిగనిగలాడే దట్టమైన జుట్టును మొలిపించే సరికొత్త ‘ఎలక్ట్రిక్ దువ్వెన’ను (China Electric Comb) తాము విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు వారు అధికారికంగా ప్రకటించారు. ఖరీదైన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలు, తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే మందులకు సురక్షితమైన, నొప్పిలేని ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సాంకేతికత నిలవనుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయోగశాలలో ఎలుకలపై అద్భుత ఫలితాలు.. 28 రోజుల్లోనే దట్టంగా జుట్టు:

ఈ వినూత్న ఆవిష్కరణ పనితీరు, సామర్థ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించేందుకు పరిశోధకులు ప్రయోగశాలలో జుట్టు లేని కొన్ని ఎలుకలను ఎంచుకుని వాటిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు నిర్వహించారు. ఎలుకల శరీరంపై ఎక్కడైతే జుట్టు పూర్తిగా రాలిపోయి నున్నగా మారిందో, ఆ ప్రాంతంలో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ దువ్వెనతో క్రమం తప్పకుండా దువ్వడం ప్రారంభించారు. ప్రయోగం ప్రారంభించిన కేవలం 28 రోజుల్లోనే ఆ ఎలుకల శరీరంపై ఉన్న బట్టతల మచ్చలు (బాల్డ్ ప్యాచ్‌లు) పూర్తిగా మాయమై, ఆ ప్రాంతాల్లో జుట్టు గడ్డిదుబ్బులా అత్యంత దట్టంగా, ఆరోగ్యంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించి ఆశ్చర్యపోయారు.

మనుషులకు కూడా ఇదే స్థాయిలో ఫలితాలు.. త్వరలోనే అందుబాటులోకి:

ఈ ఎలక్ట్రిక్ దువ్వెన నుంచి వెలువడే సురక్షితమైన స్వల్ప విద్యుత్ ప్రేరణలు చర్మంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచి, నిద్రాణమైన వెంట్రుకల కుదుళ్లను (హెయిర్ ఫోలికల్స్) ఉత్తేజపరచడం వల్లే ఇంత వేగంగా జుట్టు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రయోగశాలలో ఎలుకలపై అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన ఈ సాంకేతికత మనుషులపై కూడా అదే స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తుందని, మరిన్ని క్లినికల్ పరీక్షల అనంతరం త్వరలోనే ఇది సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని బీహాంగ్ వర్సిటీ పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!