- శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
- రూ.40 వేల లోపే అదిరిపోయే ఆప్షన్
- కెమెరా, డిస్‌ప్లే, ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయంటే? :
గెలాక్సీ S24 ఎఫ్ఈలో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఎక్సినోస్ 2400e ప్రాసెసర్, 8GB ర్యామ్, రోజువారీ పనులు, గేమింగ్‌కు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 4,700mAh బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.. అయితే, 25W ఛార్జింగ్ స్పీడ్ మాత్రం కొంత నిరాశపరుస్తుంది..
ధరకు తగ్గ ఫోనా? కాదా? :
ఈ ఫోన్‌లో మరో పెద్ద ప్లస్ పాయింట్ ఒకటే.. ఏకంగా 7 ఏళ్ల పాటు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ ప్రకటించడమే.. 256GB వేరియంట్ ధర సుమారు రూ.45,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని బ్యాంక్ ఆఫర్లతో రూ.37,999 వరకు సొంతం చేసుకోవచ్చు.
మొత్తంగా చూస్తే రూ.40 వేల బడ్జెట్‌లో టెలిఫోటో కెమెరా, మంచి డిస్‌ప్లే, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కావాలనుకునేవారికి గెలాక్సీ S24 ఎఫ్ఈ బెస్ట్ ఆప్షన్. అయితే బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా అంతగా ఉండదు. కొనేముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మీ బ్యాంక్ కార్డుపై ఆఫర్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి..


