- రూ. 50 వేల నుంచి రూ. 88 వేల వరకు.. ఈ 3 శాంసంగ్ ఫోన్లలో ఏది బెస్ట్..?
- కొత్త శాంసంగ్ S26 కొనాలా? తక్కువ ధరలో S25, S24 తీసుకోవాలా?
- కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్.. శాంసంగ్ S సిరీస్లో ఏది బెస్ట్ డీల్?
డిస్ప్లే, ప్రాసెసర్ ఇవే :
గెలాక్సీ ఎస్26లో 6.3 అంగుళాల అమోల్డ్ 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. S25, S24 రెండింటిలోనూ 6.2 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ లభిస్తాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే S26లో ఎక్సినోస్ 2600, S25లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్, S24లో ఎక్సినోస్ 2400 చిప్సెట్లు ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా S26లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 అందుబాటులో ఉంది. మిగతా 2 మోడళ్లలో పాత సాఫ్ట్వేర్ వెర్షన్లు ఉన్నాయి.
కెమెరా, బ్యాటరీలో తేడాలివే :
ఈ 3 ఫోన్లలోనూ 50MP మెయిన్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అయితే, అల్ట్రావైడ్, టెలిఫోటో కెమెరాల స్పెసిఫికేషన్లలో స్వల్ప మార్పులున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26లో 4,300mAh బ్యాటరీ ఉండగా, S25, S24ల్లో 4,000mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ 3 ఫోన్లకు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
మీకు ఏది బెస్ట్? :
లేటెస్ట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, కొత్త సాఫ్ట్వేర్ కావాలంటే S26ను తీసుకోవచ్చు. ధర, పర్ఫార్మెన్స్ కోరుకునేవారికి S25 మంచి ఆప్షన్ బెస్ట్.. బడ్జెట్ను పరంగా చూస్తే ప్రీమియం ఫోన్ S24 కూడా బాగానే ఉంటుంది. మొత్తానికి మీ అవసరాలు, బడ్జెట్, స్టోరేజ్ బట్టి డిసైడ్ అవ్వండి.. అలాగే శాంసంగ్ ఫోన్ కొనేముందు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా చెక్ చేయడం మర్చిపోవద్దు..


