- ఒప్పో రెనో 17 సిరీస్, ధర, స్పెసిఫికేషన్లు ఇవే
- స్టాండర్డ్ మోడల్, ఒప్పో రెనో 17 ప్రో కూడా
- ఒప్పో రెనో 17 ప్రో 200MP ప్రైమరీ కెమెరా సెటప్
- ఈ స్మార్ట్ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్
ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్లో 6.56-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్ప్లే (2,624 x 1,208 పిక్సెల్స్) ఉంది. ఒప్పో రెనో 17 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఒప్పో రెనో 17 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఈ ఒప్పో ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఒప్పో రెనో 17 ప్రోలో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఒప్పో రెనో 17లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
ఈ 2 స్మార్ట్ఫోన్లలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 17 ప్రోలో 7,250mAh బ్యాటరీ ఉండగా, ఒప్పో రెనో 17లో 8,000mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 80W వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.


