ఐపీఎల్‌కు వీడ్కోలు తరువాత ధోనీ భావోద్వేగ పోస్ట్ వైరల్.. అభిమానులకు ఆయన సతీమణి కీలక సూచన

Must read

View this post on Instagram

 

ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. అతడి నాయకత్వంలో సీఎస్కే ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. రెండు ఛాంపియన్స్ లీగ్‌ టీ20 టైటిళ్లను కూడా సాధించింది. ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు ఎన్నో విజయాలను అందుకుంది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం అతడి ప్రత్యేకతగా నిలిచాయి. మొత్తంగా, ధోనీ ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 158 క్యాచ్‌లు అందుకుని, 47 స్టంపింగ్స్ చేశాడు.

ధోనీ సతీమణి భావోద్వేగ సందేశం.. కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు.. 
మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ తన భర్తకు హృదయపూర్వక సందేశాన్ని అందించారు. ధోనీ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ అందమైన పోస్టును పంచుకున్నారు.
“అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభం కావాలంటే.. కొన్ని పాత అధ్యాయాలకు ముగింపు పలకాల్సిందే. ఇన్నేళ్లుగా మాహీని ప్రేమిస్తూ, మద్దతుగా నిలుస్తూ, ఆయనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు వ్యక్తిగతంగా తెలిసినా, తెలియకపోయినా మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు చూపించిన ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞులం. కొత్త ఆరంభాలు, కొత్త సాహసాలు, మరెన్నో మధుర జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తున్నాం. మాహీ.. నిన్ను చూసి ఎంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను” అంటూ తన ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!