- ఇతరుల లోన్‌కు గ్యారంటీగా మీ సంతకం పెడుతున్నారా?
- అప్పు తీర్చాల్సిన బాధ్యత మీపైనా పడుతుంది జాగ్రత్త
- లోన్ గ్యారంటీ విషయంలో ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి
మీ సిబిల్ స్కోర్‌పైనా ప్రభావం :
మరో ముఖ్యమైన విషయం.. మీరు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి లోన్ చెల్లించకపోతే మీ క్రెడిట్ రిపోర్టుపైనా నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మీరు సొంతంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి..
సంతకం చేసే ముందు ఇవి తప్పనిసరి :
ఎవరికైనా గ్యారంటీ ఇచ్చే ముందు వారి ఆదాయం, ఉద్యోగం, ఇప్పటికే ఉన్న అప్పులు, ఈఎంఐలు ఎలా చెల్లిస్తున్నారో తెలుసుకోండి. రుణ ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా చదవండి.. మీరు ఎంతవరకు బాధ్యత వహించాలో స్పష్టంగా తెలుసుకోండి. స్నేహం కోసం పెట్టిన ఒక సంతకం భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు..


