ఇట్లు అర్జున సక్సెస్ మీట్ నేడు నవంబర్ 17న హైదరాబాద్ లోని ఆవాసా హోటల్ లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఈ సక్సెస్ మీట్ కి చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. మొత్తానికి ఈ కొత్త హీరో కోసం ఇండస్ట్రీ అంతా తరలి వచ్చింది. మంచి ల్యాండింగ్ అయితే పడింది అనీష్ కి. మరి భవిష్యత్తులో వరుసగా సినిమాలు చేస్తాడా లేదా చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనశ్వర రాజన్ చిరంజీవి కాకా సినిమాలో మెగాస్టార్ కూతురుగా నటిస్తుంది. దీంతో ఈ సక్సెస్ మీట్ లో కాకా గురించి ఏమైనా మాట్లాడతారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.



