ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో కొత్తగా 30 ఈవీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు.. మహిళలకు ఫ్రీ!

Must read

Electric Bus Service: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) విశాఖపట్నంలో సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో భాగంగా మొత్తం 30 ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సరికొత్త ఈవీ బస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుండటంతో నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే: పల్లా శ్రీనివాసరావు

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పీఎం ఈ-సేవ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులను(Electric Bus Service) విశాఖలో ప్రారంభించడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. రాబోయే భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాల మీదే ఆధారపడి ఉందని, ఈ ఆధునిక ఈవీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

శబ్ద కాలుష్యం లేని సురక్షిత ప్రయాణం.. పర్యాటకులకు ఎంతో మేలు:

విశాఖ సిటీ పరిధిలో ప్రయాణించే వారికి ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా, పూర్తి భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించేందుకే ఈ 30 ఈవీ మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టామని ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అధునాతన ఫీచర్లతో కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ బస్సుల రాకతో విశాఖ స్థానికులతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు దేశవ్యాప్తంగా వచ్చే పర్యాటకులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!