‘కెరూబ్’ ట్రైలర్ చూశారా..? భలే ఉందే.. ఒక అడవిలో హీరో – హీరోయిన్..

Must read

Kerub Trailer : విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా కెరూబ్. ఖుషీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై MJ నాయుడు దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ట్యాగ్ లైన్స్. నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక అమ్మాయి అనుకోకుండా ఓ అడవిలోకి వస్తే అక్కడ నుంచి హీరో ఆమెని ఎలా తప్పించాడు, ఆ అమ్మాయికి ఉన్న ప్రమాదం ఏంటి అని ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తుంది.

మీరు కూడా కెరూబ్ ట్రైలర్ చూసేయండి..

 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. సినిమా టీజర్, ట్రైలర్ చూడగానే మన ఫారెస్ట్ లో చేసిన అవతార్ లాగా అనిపించింది. మన తెలంగాణలో ఇంత అందమైన అడవులున్నాయా అనిపించింది. హీరో విజయ్ దేవరకొండ, నాని లా ఉన్నాడు అని అన్నారు. నిర్మాత M.J.నాయుడు మాట్లాడుతూ.. నాకు ఇవాళ చాలా ఎమోషనల్ గా ఉంది. దాదాపు 16 ఏళ్లలో ఈ సినిమా తీయగలిగాను. నాకు సినిమాటోగ్రాఫర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. గతంలో నా షార్ట్ ఫిలింకి తనే చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకు తనే అద్భుతమైన విజువల్స్ అందించారు. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని తెలిపారు.

 Kerub Trailer Released

 

హీరో విహాన్ కార్తీక్ మాట్లాడుతూ.. నేను ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రలో నటించా. అప్పుడే ఈ సినిమా అవకాశం వచ్చింది. ఓ కొత్త ఫేస్ కావాలని దర్శకుడు నన్ను ఎంచుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ లోకేషన్స్ ను సెట్ చేశారు. దర్శకుడితో ఆల్ మోస్ట్ 7 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నా అని తెలిపారు.

 

 

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!