అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా? IRCTC అదిరిపోయే ప్యాకేజ్.. పూర్తి షెడ్యూల్ వివరాలివే!

Must read

  • అరుణాచలానికి వెళ్లే భక్తులకు శుభవార్త..
  • అరుణాచలం, కాంచీపురం దర్శనానికి స్పెషల్ టూర్
  • కాచిగూడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ మీకోసమే

ప్యాకేజ్‌లో ఏమేం ఉంటాయంటే? :
పుదుచ్చేరి చేరుకున్న తర్వాత అరోవిల్, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అరుణాచలం వెళ్లి పరమశివుడిని దర్శించుకోవచ్చు. అక్కడ రాత్రి బస చేసిన అనంతరం కాంచీపురం చేరుకుని కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.. స్థానిక ప్రయాణాలకు ఏసీ వాహనం ఏర్పాటు చేస్తారు. రెండు రోజుల బస, ఉదయం టిఫిన్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్యాకేజ్‌లో పొందవచ్చు..

టికెట్ ధరలు ఎంతంటే? :
థర్డ్ ఏసీ విభాగంలో ఒక్కొక్కరికి ట్విన్ షేరింగ్ ధర రూ.16,900 నుంచి ప్రారంభమవుతుంది. ట్రిపుల్ షేరింగ్ ధర రూ.13,210గా ఉంది. స్లీపర్ క్లాస్‌లో ట్విన్ షేరింగ్‌కు రూ.14,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,125గా నిర్ణయించారు. పిల్లలకు ప్రత్యేక ధరలు కూడా ఉన్నాయి. నలుగురు నుంచి ఆరుగురు కలిసి ప్రయాణిస్తే మరింత తక్కువ ధరలకు ప్యాకేజ్ పొందవచ్చు..

కార్తీక మాసంలో అరుణాచల దర్శనం చేసుకోవాలనుకునేవారు ఈ ఛాన్స్ అసలు వదులుకోవద్దు.. అయితే, ఆలయ ప్రవేశ రుసుములు, ఇతర వ్యక్తిగత ఖర్చులు మాత్రం ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. బుకింగ్‌కు ముందు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో లేటెస్ట్ ధరలు, సీట్ల వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!