ఏఐ మోసాలపై కఠిన చర్యలు తీసుకోండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి వినతిపత్రం

Must read

Chiranjeevi: కృత్రిమ మేధ (AI) సాంకేతికత దుర్వినియోగం, డీప్‌ఫేక్‌ వీడియోలు, నానాటికీ పెరిగిపోతున్న డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు. నవంబర్ 2న తనయుడు రామ్ చరణ్‌తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన సమయంలో డీప్‌ఫేక్ టెక్నాలజీ ముప్పుపై సుదీర్ఘంగా చర్చించామని, అమిత్ షా సూచన మేరకే ఇప్పుడు కిషన్ రెడ్డికి ఈ వినతిపత్రం సమర్పించినట్లు చిరంజీవి (Chiranjeevi)తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

కళాకారుల గౌరవం, పౌరుల డిజిటల్ భద్రతను కాపాడటం అందరి బాధ్యత:

ఏఐ టెక్నాలజీని తప్పుదారి పట్టిస్తూ సృష్టిస్తున్న నకిలీ, డీప్‌ఫేక్ కంటెంట్‌ను నియంత్రించేందుకు బలమైన చట్టపరమైన రక్షణ వ్యవస్థ, కఠిన శిక్షలు అవసరమని చిరంజీవి పేర్కొన్నారు. కళాకారుల గౌరవం, వ్యక్తిగత గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు దేశంలోని ప్రతి పౌరుడి డిజిటల్ భద్రతను పరిరక్షించడం అందరి బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినందుకు చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!