PM Modi- Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్ నిధుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రగతికి కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి(PM Modi- Revanth Reddy), రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక కరవు ప్యాకేజీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, ఖేలో ఇండియా పోటీలకు రావాలని ఆహ్వానం:
దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమైన తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అలాగే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి విచ్చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.


