- జాతర వేదికపై హైడ్రామా.. సీఎం వెళ్లగానే రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
- మాట్లాడనీయలేదని ఆగ్రహం.. పోడియం, కుర్చీలు ధ్వంసం
- మైక్ విసిరేసి ప్రభుత్వంపై హరీశ్ సింగ్ ధామి ఫైర్
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ప్రజల సమస్యలను ప్రభుత్వం వినడానికి కూడా సిద్ధంగా లేదని మండిపడ్డారు. ముఖ్యంగా రెండ్రోజుల క్రితం మరణించిన ఎనిమిదేళ్ల బాలిక ఘటనతో పాటు కనార్ ప్రాంతంలో రహదారి సౌకర్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రస్తావించడం తప్పా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ప్రవర్తన సిగ్గుచేటు :
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే ప్రవర్తన సిగ్గుచేటని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఆదివారం మధ్యాహ్నంలోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది.. ప్రజల సమస్యలపై మొదలైన వివాదం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరుగా మారింది. జాతర వేదికపై జరిగిన ఈ హైడ్రామా ఉత్తరాఖండ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది..


