చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. భార‌త్ 209 ఆలౌట్‌.. కివీస్ టార్గెట్ 210

Must read

IND vs NZ : మౌంట్ మౌంగనుయి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదో వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 42.1 ఓవ‌ర్ల‌లో 209 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. న్యూజిలాండ్ ముందు 210 ప‌రుగుల విజ‌య లక్ష్యం నిలిచింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ (46; 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్ కిష‌న్ (46; 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తృటిలో హాఫ్ సెంచ‌రీ చేజార్చుకున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (22), న‌మ‌న్ ధీర్ (22) లు ప‌ర్వాలేద‌నిపించారు.

సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ (7), విరాట్ కోహ్లీ (5), రుతురాజ్ గైక్వాడ్ (18)లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్, జాకబ్ డఫీ చెరో మూడు వికెట్లు తీశారు. మాథ్యూ ఫిషర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్లెయిర్ టిక్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో ఓ వికెట్ సాధించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!