Dil Raju-Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సినిమా కథ ఏంటి.? ఎలాంటి జానర్‌లో తెరకెక్కబోతోంది? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
లేటెస్ట్ టాక్ ప్రకారం..ఈసారి పవన్ కల్యాణ్ కోసం ఓ చక్కని కుటుంబ కథను సిద్ధం చేస్తున్నారట. భారీ యాక్షన్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కాకుండా కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా సాగే కథతో సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది.
పవన్ కల్యాణ్‌లోని ఫ్యామిలీ హీరోను మరోసారి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ మార్క్ కామెడీ టైమింగ్, కుటుంబ సన్నివేశాలు, ఎమోషనల్ ఎపిసోడ్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను ప్లాన్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.
గతంలో పవన్, దిల్‌రాజు కాంబినేషన్‌లో వచ్చిన వకీల్ సాబ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో మరోసారి వీరిద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ నిజంగానే పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తారా.? అంతకంటే ముందే ఓజీ-2పై ఫోకస్ పెడుతారా.? డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేదెప్పుడు అనేది వేచి చూడాలి.


