ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పైసా ఖర్చు లేకుండా ఈ వివరాలు ఫ్రీగా మార్చుకోవచ్చు!

Must read

  • ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్..
  • ఫ్రీ అప్‌డేట్‌కు డిసెంబర్ 31నే లాస్ట్ డేట్..
  • ఆధార్‌లో ఈమెయిల్ మార్చుకోవాలా?
  • వెంటనే ఇలా చేయండి

ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని ఫ్రీగా మార్చొచ్చు :
ఈ ప్రాసెస్ కోసం ముందుగా అధికారిక ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. యాప్‌లోని (Services) సెక్షన్ లోకి వెళ్లి (Free Email Update) ఆప్షన్ అందుబాటులో ఉంటే ఎంచుకోవాలి.

అక్కడ కనిపించే సూచనలను అనుసరిస్తూ.. ప్రస్తుతం అప్‌డేట్ చేయాలనుకుంటున్న కొత్త ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ మెయిల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. దీంతో మీ రిక్వెస్ట్ ప్రాసెస్‌కు వెళ్తుంది.

ఆలస్యం చేయొద్దు :
ఆధార్‌కు సరైన ఈమెయిల్ ఐడీ లింక్ అయి ఉండాలి. అప్పుడే ఏదైనా ముఖ్యమైన సమాచారం, నోటిఫికేషన్లు అందుకోవచ్చు.. అయితే, ఈమెయిల్ ద్వారా ప్రతి ఆధార్ ఓటీపీ వస్తుందని భావించకూడదు. అలాగే ఫ్రీ అప్‌డేట్ గడువు, ఛార్జీల వివరాల కోసం యూఐడీఏఐ అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి. యాప్‌లో సదుపాయం కనిపిస్తే గడువులోగా పూర్తి చేయడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!