’10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్.. విద్యావేత్తలు, ఎంట్రప్రెన్యూర్ల విజయగాథలకు పట్టాభిషేకం

Must read

’10TV Shaping Tomorrow: తెలుగు మీడియా రంగంలో నిష్పక్షపాత వార్తా ప్రసారాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ ‘10టీవీ’ దశాబ్దానికి పైగా తన విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కేవలం వార్తలను వేగంగా అందించడమే కాకుండా, సమాచారాన్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా విశ్లేషిస్తూ నిజానిజాలను ప్రజల ముందుంచడం 10టీవీ ప్రత్యేకత. ఏ రాజకీయ పార్టీకో లేదా ప్రభుత్వానికో కొమ్ముకాయకుండా సామాన్యుల పక్షాన నిలబడుతూ ప్రజాసమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో ఈ ఛానల్ తనదైన ముద్ర వేసింది. లోకల్ నుంచి గ్లోబల్ వరకు ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ స్పీడ్ న్యూస్, 360 డిగ్రీస్ స్టోరీస్, ఎక్స్‌పర్ట్స్ అనాలసిస్, క్రైమ్, వీకెండ్ రౌండప్స్ వంటి వైవిధ్యభరిత కార్యక్రమాలతో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ తిరుగులేని రీచ్‌తో దూసుకుపోతోంది.

ప్రముఖుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రత్యేక ఇంటర్వ్యూలు!

రాజకీయ, సామాజిక, ఆర్థిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో నిర్వహించే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్ షోలు, ఫేస్ టు ఫేస్ కార్యక్రమాలతో 10టీవీ వీక్షకులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు బండి సంజయ్, ఈటల రాజేందర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత వంటి నేతలు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖుల అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సత్తా చాటుతోంది.

ప్రజాసమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్స్.. పాలకులను అలర్ట్ చేసే కథనాలు:

తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు, ఏలూరు క్యాన్సర్ సమస్య, రాయలసీమ మటన్ మాఫియా, హైదరాబాద్ మ్యాన్‌హోల్స్, కరెంటు తీగలు, మాంజాల ప్రమాదాలపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అంతేకాకుండా కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల గ్రౌండ్ రియాలిటీ, అమరావతి అభివృద్ధి, రైతుల కష్టనష్టాలు, పూరీ రత్న భండార్, జొన్నగిరి బంగారు గనుల విశేషాలను సమగ్ర కథనాల రూపంలో అందిస్తోంది.

‘10TV Shaping Tomorrow’ వంటి మెగా ఈవెంట్లతో స్ఫూర్తిదాయక వేదికలు:

ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమలుపై మెగా కాంక్లేవ్స్, మారథాన్ డిబేట్స్ నిర్వహించడంలో 10టీవీ ముందుంటోంది. ముఖ్యంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విద్యావేత్తలు, ఎంట్రప్రెన్యూర్ల విజయగాథలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ (’10TV Shaping Tomorrow)మెగా ఈవెంట్ ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా 10TV Shaping Tomorrow పేరుతో బుక్ కూడా వొడుదల చేసింది. డైనమిక్ జర్నలిజం, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన 10టీవీ, భవిష్యత్తులోనూ రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని శిఖరాలను అధిరోహించనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!