బాసర వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నో ట్రాఫిక్ టెన్షన్.. హైదరాబాద్‌ నుంచి కొత్త రూట్ ఇదే..!

Must read

  • హైదరాబాద్‌ నుంచి బాసరకు 3 గంటలే ప్రయాణం
  • NH-44కు మరో ప్రత్యామ్నాయ మార్గం
  • బాసరకు సంగారెడ్డి మీదుగా కొత్త రూట్

సంగారెడ్డి మీదుగా ఎలా వెళ్లాలంటే? :
హైదరాబాద్‌ నుంచి బయలుదేరి పటాన్‌చెరు మీదుగా NH-161 హైవేపైకి వెళ్లాలి. అక్కడి నుంచి సంగారెడ్డి, జోగిపేట, పిట్లం మీదుగా ప్రయాణించాలి. అనంతరం NH-161BB రహదారిపైకి వెళ్లి మద్నూర్, బోధన్ మీదుగా బాసరకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో దూరం సుమారు 200 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా..

సమయం ఆదా ఎంతంటే? :
ఈ కొత్త ప్రత్యామ్నాయ మార్గంలో సాధారణ ట్రాఫిక్ ఉంటే 3 గంటల నుంచి 4 గంటల్లో బాసరకు చేరుకోవచ్చు.. అదే పాత NH-44 మార్గంలో సుమారు 220 నుంచి 230 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావచ్చు. దీనికి 4.5 నుంచి 5 గంటల సమయం పట్టొచ్చు. పరిస్థితులను బట్టి కొత్త మార్గంలో గంట నుంచి 2 గంటల వరకు సమయం ఆదా అవుతుంది.

అయితే, రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయాన్ని బట్టి ఈ లెక్కలు మారవచ్చు. అందుకే, బాసర ప్రయాణానికి బయలుదేరే ముందు గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ ట్రాఫిక్, రూట్ పరిస్థితులను చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా బాసరకు చేరుకోవచ్చు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!