ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను టెన్షన్.. 18, 19 తేదీల్లో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!

Must read

  • ఉత్తరాంధ్రకు మరోసారి తుపాను ముప్పు.. 2 రోజులు భారీ వర్షాలు
  • బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను.. అలర్ట్ జారీ
  • 18, 19 తేదీల్లో వర్షాల బీభత్సం.. తీర ప్రాంత ప్రజలకు బిగ్ అలర్ట్.. 

వర్షాల విషయానికి వస్తే.. :
18వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 19వ తేదీన పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

గరిష్ఠంగా 60కి.మీ వేగంతో ఈదురుగాలులు :
మరోవైపు తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత కూడా భారీగా పెరగనుంది. ఈ నెల 16 నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది..

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు :
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు ఆదివారం సాయంత్రంలోగా తీరానికి చేరుకోవాలని, 16వ తేదీ నుంచి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచనలు చేశారు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!