- కొత్త వాలెట్ ఫీచర్‌తో ఓపెన్‌ఏఐ సంచలనం
- ఇక మీ తరఫున ఏఐనే షాపింగ్ చేస్తుంది
- ఓపెన్‌ఏఐ కొత్త ఫీచర్ విశేషాలివే
యూజర్లు తమకు కావాల్సిన వస్తువు గురించి ఏఐ ఏజెంట్‌కు చెబితే.. అది వివిధ వెబ్‌సైట్లలో ప్రొడక్టులను వెతికి, కొనుగోలుకు సంబంధించిన వివరాలను రెడీ చేస్తుంది. అయితే, చివరగా డబ్బులు చెల్లించే ముందు యూజర్ అనుమతి తప్పనిసరి..
అనుమతి లేకుండా రూపాయి కూడా కట్ కాదు :
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో 18 ఏళ్లు నిండిన, అమెరికాలో జారీ చేసిన కార్డు ఉన్న చాట్‌జీపీటీ ప్రో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డును ఒకసారి వాలెట్‌కు లింక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొనుగోళ్లకు వాడేసుకోవచ్చు అనమాట.. అయితే, ప్రతి లావాదేవీకి వస్తువు, ధర, పేమెంట్ కార్డు వివరాలను పరిశీలించి ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ఫ్రింట్ ద్వారా అనుమతి ఇవ్వాలి.
కార్డు వివరాలకు ఫుల్ ప్రొటెక్షన్ :
సెక్యూరిటీ విషయంలోనూ ఓపెన్‌ఏఐ జాగ్రత్తలు తీసుకుంది. అసలు కార్డు వివరాలను ఏఐ ఏజెంట్లకు నేరుగా అందించకుండా ప్రత్యేక టోకెన్ల ద్వారా పేమెంట్లు జరిగేలా ఏర్పాటు చేసింది. ఆపిల్ పే, గూగుల్ వాలెట్‌లోనూ ఇలాంటి విధానమే ఉంది.
ఈ సదుపాయం కోసం వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలతో ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. షాపింగ్ నుంచి పేమెంట్ల వరకు ఏఐ సాయంతో పనులు ఈజీగా పూర్తి కానున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సదుపాయాలు మరిన్ని దేశాలకు విస్తరిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది..


