తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జి.. బీఎం సందీప్‌కు కీలక బాధ్యతలు!

Must read

  • కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం..
  • తెలంగాణ ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్
  • మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్..

విదేశాలకు మీనాక్షి నటరాజన్ :
ఉన్నత చదువుల కోసం మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఆమె అందించిన సేవలను అధిష్ఠానం ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది..

బీఎం సందీప్ వైపే మొగ్గు :
వాస్తవానికి, తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి ఎంపికపై కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే, చివరకు అధిష్ఠానం బీఎం సందీప్ వైపే మొగ్గు చూపింది..

ఇక కొత్త ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టనున్న బీఎం సందీప్ ముందు పలు కీలక అంశాలు ఉండనున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను ఉత్సాహపరచడం వంటి అంశాలు ఆయనకు సవాళ్లుగా మారనున్నాయి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!