- 555 రోజుల స్కీమ్‌పై వడ్డీ పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా
- BoB కొత్త వడ్డీ రేట్లతో సీనియర్ సిటిజన్లకు మరింత లాభం
- ఫిక్స్డ్ డిపాజిట్‌పై అదనపు ఆదాయం..
ఇక 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.45 శాతం వడ్డీ లభించనుంది. మరోవైపు 444 రోజుల ‘బాబ్ స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్ స్కీమ్’ వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సాధారణ కస్టమర్లకు 6.45 శాతం, సీనియర్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్లకు 7.05 శాతం వడ్డీ కొనసాగుతుంది.
సీనియర్లకు అదనపు బెనిఫిట్స్ :
బ్యాంకు నిబంధనల ప్రకారం.. 60 ఏళ్లు దాటిన వారికి డిపాజిట్ టెన్యూర్ బట్టి అదనపు వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల వరకు 0.50 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 0.60 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 1 శాతం వరకు అదనపు బెనిఫిట్ లభిస్తుంది.
80 ఏళ్లు పైబడిన వారికి ఎఫ్డీ డిపాజిట్లపై మరో 0.10 శాతం అదనపు వడ్డీ అందుతుంది. అయితే, ఈ కొత్త రేట్లు కొత్తగా చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లు, రెన్యువల్ చేసే డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ లెక్కింపు విధానం, మెచ్యూరిటీ మొత్తం, అడ్వాన్స్ విత్ డ్రా వంటి నిబంధనలను తెలుసుకోవడం బెటర్..


