- రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
- తెలంగాణలో మహిళలకు డబుల్ ధమాకా
- మహిళలకు చీరలు, కుటుంబానికి రూ.5 లక్షల బీమా
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది.. ఇందుకోసం రూ.334 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి చీరల రంగు, డిజైన్లోనూ మార్పులు చేశారు. చిలుకపచ్చ రంగు బాడీకి ఎరుపు రంగు పట్టు, జరీ అంచులతో ఆకర్షణీయంగా రూపొందించారు.
చీరలు ఎలా తీసుకోవాలి? :
చీరల పంపిణీ కేంద్రాలకు మహిళలు తమ రేషన్ కార్డు తీసుకెళ్లాలి. అక్కడ అధికారులు వివరాలు రిజిస్టర్ చేసి చీరలు అందిస్తారు. వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు కుటుంబానికి బీమా భరోసా, మరోవైపు మహిళలకు చీరల పంపిణీతో నవంబర్ 19 తెలంగాణలో ప్రత్యేకంగా నిలవనుంది..


