RC 17 : రంగస్థలం హిట్ తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ RC17. ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే మూవీ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా మెగాస్టార్ చిరంజీవి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు.
ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్పీడందుకోగా క్యాస్ట్ అండ్ క్రూ ఎంపికపై కసరత్తు జరుగుతోందట. RC17 మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను 2026 డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న టాక్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి లేటెస్ట్ టాక్ కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో RC17పై అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఈసారి సుకుమార్ ఎలాంటి కథాంశంతో రాబోతున్నారనేది సస్పెన్స్‌గానే ఉంది. RC17 స్టోరీ లైన్‌పై రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. అయితే చరణ్‌ను సుక్కు ఎలా చూపించబోతున్నాడు.? రామ్‌చరణ్ పాత్రలో ఎలాంటి కొత్తదనం ఉండబోతోంది.? రంగస్థలం స్టోరీకి, ఆ సినిమాలో చరణ్ రోల్‌కు భిన్నంగా..ఈసారి కొత్త లుక్‌లో కనిపంచబోతున్నాడా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభమైతే ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే షూటింగ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2028లో RC17ను రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు.


