IND vs NZ : మౌంట్ మౌంగనుయి వేదికగా న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. 334 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది.
బౌలర్ మ్యాట్ హెన్రీ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. తొలి బంతికే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో హిట్ మ్యాన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లో ఉన్న ఫిల్ అలెన్ చేతుల్లోకి వెళ్లింది. అతడు చాలా చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ మూడు బంతులను ఆచితూచి ఆడాడు. అయితే.. నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఓవర్ ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Rohit Sharma – 0
Virat Kohli – 0
Shreyas Iyer – 0What a start from Matt Henry!
#NZvIND https://t.co/wi24T2zpck
— Cricbuzz (@cricbuzz)
దీంతో భారత జట్టు పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు కోల్పోయింది. వీరిలో రోహిత్, శ్రేయస్ లు గోల్డెన్ డకౌట్లు కాగా.. కోహ్లీ నాలుగు బంతులు ఆడాడు.
కాగా.. వన్డేల్లో భారత జట్టు తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.


