Gold Silver Prices Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బులియన్ మార్కెట్ నేడు కాస్త తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన పసిడి ధరలు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, అమెరికన్ డాలర్ విలువలో వచ్చిన మార్పుల కారణంగా నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ వర్గాల తాజా గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) స్వచ్ఛమైన బంగారం(Gold Silver Prices Today) ధర రూ.131 మేర తగ్గి, గ్రాముకు రూ.13,849 చొప్పున తులానికి రూ.1,38,490 వద్ద నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి అత్యధికంగా వినియోగించే 22 క్యారెట్ల పసిడి ధర తులానికి రూ.120 తగ్గి, గ్రాముకి రూ.12,695 చొప్పున 10 గ్రాములకు రూ.1,26,950 వద్ద ట్రేడ్ అవుతోంది.
కిలో వెండి ధర రూ.1,99,900.. రాష్ట్రాన్ని బట్టి స్వల్ప వ్యత్యాసం:
మరోవైపు బంగారం బాటలోనే వెండి మార్కెట్లోనూ ధరలు కాస్త నిలకడగా కొనసాగుతూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్, పారిశ్రామిక అవసరాల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.1,99,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు, ఆభరణాల తయారీ మజూరీల ఆధారంగా వివిధ నగరాల్లో వెండి రేట్లలో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.
దేశంలోని మెట్రో నగరాల్లో నేటి బంగారం రేట్లు (10 గ్రాములకు):
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల ప్రధాన మార్కెట్లయిన హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,38,490 వద్ద ఉండగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,26,950 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు ఐటీ హబ్ బెంగళూరు నగరాల్లోనూ సరిగ్గా ఇవే ధరలు నమోదయ్యాయి. ఇక చెన్నై మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,38,650, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,100 వద్ద ట్రేడ్ అవుతుండగా.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,38,640, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,100 వద్ద స్థిరపడ్డాయి. కొనుగోలుదారులు ఆభరణాలు కొనేముందు జీఎస్టీ (GST), తరుగు చార్జీలను కూడా గమనించాల్సి ఉంటుంది.


