ఆంధ్రప్రదేశ్ కి మరో తుఫాన్ గండం.. బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం!

Must read

Ap Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలను మరోసారి వాతావరణ మార్పులు కలవరపెడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తాజాగా అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Ap Cyclone Alert) వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం రేపటికి సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించడంతో తీర ప్రాంత జిల్లాల్లో అప్రమత్తత నెలకొంది.

గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. సముద్రంలో అలజడి:

ఈ అల్పపీడన ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు ఏపీ తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. సముద్రం తీవ్ర అలజడిగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

తుఫాన్ పయనంపై నిరంతర నిఘా.. తీర ప్రాంతాల్లో అప్రమత్తత:

ప్రస్తుతం అల్పపీడనం కదలికలను వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, దీని పూర్తి పయనంపై త్వరలోనే మరింత స్పష్టత వస్తుందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తక్షణమే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!