సెహ్వాగ్ వారసుడి జోరు.. లక్ష్య్ మెరుపులు.. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్!

Must read

  • తృటిలో సెంచరీ మిస్.. ఆర్యవీర్ హాఫ్ సెంచరీ..
  • అఫ్గాన్‌పై అదిరిపోయే విజయం..
  • ఫైనల్లో పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ
  • ఆసియా కప్ టైటిల్‌పై కన్నేసిన భారత యువ జట్టు

ఆర్యవీర్ సెహ్వాగ్ హాఫ్ సెంచరీ :
కెప్టెన్ లక్ష్య్ రాజేష్ రాయచందాని అద్భుతంగా ఆడాడు. 90 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 57 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీకే వినీత్ కూడా 62 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అఫ్గానిస్థాన్ 227 పరుగులు :
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. నోమన్ సలార్‌జాయ్, షా ఫైజల్ రహిమీ చెరో 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.

మరో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లీగ్ దశలో భారత్‌కు పాక్ చేతిలో ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఫైనల్లో ఆ ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. మరి ఈసారి భారత కుర్రాళ్లు పాక్‌ను ఓడించి ఆసియా కప్‌ను ముద్దాడతారా? లేదో చూడాలి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!