- శాంసంగ్ గెలాక్సీ S27 ప్రో వచ్చేస్తోంది..
- డిజైన్, ఫీచర్లు, 200ఎంపీ కెమెరా, 16GB ర్యామ్
- గెలాక్సీ S27 అల్ట్రాకు గట్టి పోటీనా?
200MP కెమెరాతో అదరగొట్టే ఛాన్స్ :
కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ ఉండొచ్చని సమాచారం.. 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా అందించే ఛాన్స్ ఉంది.
ప్రాసెసర్, బ్యాటరీ ఎలా ఉంటాయంటే? :
ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 6 ఎక్స్ ట్రీమ్ చిప్‌సెట్, 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజ్ ఉండొచ్చని టాక్. అలాగే 5,200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9తో వచ్చే అవకాశం ఉంది.
ధర ఎంతంటే? :
అమెరికాలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్27 ప్రో ప్రారంభ ధర 1,200 నుంచి 1,300 డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లోకి వస్తే.. ధర మరింత ఆసక్తికరంగా మారనుంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి లీక్స్ మాత్రమే. శాంసంగ్ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..


