నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో విచారణ

Must read

CM Revanth Reddy: గతంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన కేసులో విచారణ నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. అప్పట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), 2021 ఏప్రిల్ 11వ తేదీన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో కనీస భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఆర్‌పీసీ 313 కింద వాంగ్మూలం నమోదు.. భద్రత నడుమ కోర్టు ప్రాంగణానికి ముఖ్యమంత్రి!

ఈ కేసు విచారణలో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 313 కింద నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కోర్టు ఎదుట హాజరై న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!