ఇది కదా డిస్కౌంట్.. రూ.79,900 మ్యాక్‌బుక్ నియో ఇప్పుడు రూ.64,890కే.. ఈ ఆఫర్ మిస్ కావొద్దు!

Must read

  • ఆపిల్ మ్యాక్‌బుక్ కొనాలనుకుంటున్నారా?
  • బ్యాంక్ కార్డులతో మరింత తక్కువ ధరకే
  • రూ.15,010 వరకు ఆదా చేసుకోవచ్చు

ఈ రెండు ఆఫర్లను కలిపి చూస్తే.. మ్యాక్ బుక్ నియో నికర ధర రూ.64,890కు చేరుతుంది. అంటే మొత్తం మీద రూ.15,010 వరకు ఆదా చేసుకోవచ్చన్నమాట. అంతేకాదు, 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. నెలకు రూ.10,815 నుంచి ఈఎంఐతో పాటు బ్యాంక్ ఆఫర్లు నిబంధనలు వర్తిస్తాయి.

మ్యాక్‌బుక్ నియో ఫీచర్లు ఇవే :
ఈ ల్యాప్‌టాప్‌లో 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఆపిల్ ఎ18 ప్రో చిప్‌సెట్‌తో పనిచేసే ఇందులో 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి.

8GB యూనిఫైడ్ మెమరీ, 512GB వరకు SSD స్టోరేజ్ ఆప్షన్, 1080p ఫేస్ టైమ్ హెచ్‌డీ కెమెరా అద్భుతంగా ఉంటుంది. (macOS Tahoe) ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 36.5Wh బ్యాటరీ, 20W USB-C ఛార్జర్ కూడా ఉన్నాయి. హయ్యర్ వేరియంట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లభిస్తుంది.

ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉండొచ్చు. అయితే, ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు బ్యాంక్ ఆఫర్లు, వేరియంట్, ఫైనల్ ధరను తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!