- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?
- 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో కొత్త జీతం ఎంతంటే
- 8వ పే కమిషన్ రిపోర్ట్ ఎప్పుడంటే?
- ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై ఆసక్తికర చర్చ
అంటే.. ప్రస్తుతం ఉన్న రూ.18,000 కనీస వేతనంపై రూ.16,560 పెంపు కనిపిస్తుంది. అయితే, ఇది కేవలం అంచనా లెక్క మాత్రమే. ఫైనల్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇంకా ఖరారు కాలేదు. అలాగే కొత్త పే నిర్మాణంలో డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సుల లెక్కలు కూడా కీలకంగా ఉంటాయి. బేసిక్ పే పెరిగినంత మాత్రాన చేతికి వచ్చే జీతం కూడా అదే రేంజ్ లో పెరుగుతుందని చెప్పలేం..
నివేదిక ఎప్పుడు వస్తుంది? :
8వ వేతన సంఘం ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఉద్యోగ సంఘాలు, ప్రతినిధుల అభిప్రాయాలు, డిమాండ్లను పరిశీలిస్తోంది. వీటి ఆధారంగా రిపోర్టును రెడీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత వివరాల ప్రకారం.. ఈ సంఘం 2025 నవంబర్ 3న ఏర్పాటైంది. రిపోర్టును సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2027 మే 3 వరకు గడువు ఇచ్చింది. అయితే, అంతకంటే ముందే రిపోస్టు సమర్పిస్తారా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.
ఉద్యోగులకు కొత్త జీతం ఎప్పుడంటే? :
నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. 2026 జనవరి 1 నుంచి అమలు చేసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై వచ్చే అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూడాల్సిందే..


