వెంకీ కుడుముల మాట్లాడుతూ.. చెన్నైలో స్క్రిప్ట్ రాసుకోడానికి, కొంతమంది ఆర్టిస్టులను కలవడానికి వెళ్ళాను. అక్కడ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా చూసాను. అందులో రష్మిక చాలా బాగా అనిపించింది. దాంతో నాగశౌర్య కు ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయిని చూసాను చాలా బాగుంది అంటే. శౌర్య కూడా నేను ఒక ఒక అమ్మాయిని చూసాను వీడియో సాంగ్ లో అని తను ఆ సాంగ్ పంపించాడు. నేను కూడా సినిమా చూడమని చెప్పాను. సర్ ప్రైజింగ్ గా ఇద్దరం రష్మికనే అనుకున్నాం. నేను చెప్పిన సినిమా, తను చెప్పిన సాంగ్ రెండిట్లో హీరోయిన్ రష్మికనే. ఇద్దరం అనుకోకుండా ఒకరినే సెలెక్ట్ చేసాం అంటే ఈ అమ్మాయే ఫిక్స్ అని అనుకున్నాము.
దాంతో వెళ్లి రష్మిక ను కలిసి నేరేషన్ ఇచ్చాను. కానీ రష్మిక తెలుగు సినిమాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తెలుగులో సినిమాలు చేయనంది. అప్పుడే మొదటి సినిమా కన్నడలో అయింది అప్పుడే కర్ణాటక దాటి వెళ్లాలా అని ఆలోచనలో ఉంది. ఎలా ఉంటుందో ఇక్కడ అని భయపడింది. దాంతో నేను వాళ్ళ పేరెంట్స్ కి కూడా కథ చెప్పి ఒప్పించాను. బావుంటుంది, బాగా చూసుకుంటాం అని చెప్పి ఒప్పించాను. ఆ అమ్మాయిని సినిమాకు ఓకే చేసాక ఫోటోషూట్ అవ్వగానే నా ఇంస్టాగ్రామ్ లో “Next Big Thing in Tollywood” అని పెట్టాను అదే నిజమైంది అని అన్నారు


