వైట్‌హౌస్‌ దగ్గర ఒక్కసారిగా కలకలం.. కారు ప్రమాదంతో లాక్‌డౌన్‌.. ట్రంప్‌ అప్పుడే లోపలే!

Must read

  • వైట్‌హౌస్‌లో ట్రంప్‌.. భద్రతా వలయంలోకి దూసుకొచ్చిన కారు
  • కారును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • జర్నలిస్టులను లోపలికి పంపిన సీక్రెట్‌ సర్వీస్‌

ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కారులో ఉన్న డ్రైవర్‌ను కిందకు దిగాలని ఆదేశించి, నేలపై పడుకోవాలని సూచించారు. మరోవైపు వైట్‌హౌస్‌ భద్రతను పర్యవేక్షించే సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అక్కడున్న మీడియా ప్రతినిధులను వెంటనే భవనం లోపలికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనతో వైట్‌హౌస్‌ పరిసరాల్లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ప్రమాదం వెనుక అసలు కారణమేంటి? డ్రైవర్‌ ఎవరు? కావాలనే కారుతో దూసుకొచ్చారా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

అయితే, ఆ ప్రాంతంలో వాహనాలు వేగంగా దూసుకెళ్లడానికి వీలులేని విధంగా రోడ్డు నిర్మాణం ఉండటం గమనార్హం.. ఇరుకైన రహదారి, సిగ్నల్‌ వద్ద మలుపు కారణంగా వాహనాల వేగానికి పరిమితులు ఉంటాయి. అయినప్పటికీ కారు భద్రతా పరిధిలోకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!