- వాట్సాప్లో మరో అదిరిపోయే అప్డేట్..
- వాట్సాప్లో ఫోటోలు, వీడియోలు పంపితే క్వాలిటీ తగ్గదు..
- ఫోటోలు పంపితే క్వాలిటీ పోతోందనే భయం అక్కర్లేదు
- ఇక కంప్రెషన్ లేకుండానే ఫోటోలు, వీడియోలు పంపొచ్చు
ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేలా మరో కొత్త ఆప్షన్ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్టు WABetaInfo రిపోర్టులో వెల్లడించింది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఫోటోలు, వీడియోలు పంపేటప్పుడు (Standard Quality, HD Quality) అనే రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. కొత్త ఫీచర్ వస్తే వీటితో పాటు (Original Quality) అనే మూడో ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది..
వాట్సాప్ ప్లస్ యూజర్లకేనా? :
ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. ఫోటోలు, వీడియోలు ఎలాంటి కంప్రెషన్ లేకుండా ఒరిజినల్ క్వాలిటీలోనే పంపుకోవచ్చు. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఈ ఫీచర్ వాట్సాప్ ప్లస్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది..
మరోవైపు.. ప్రస్తుతం వాట్సాప్ ప్లస్ లేకపోయినా ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలు, వీడియోలు పంపుకోవచ్చు. ఇందుకోసం గ్యాలరీ నుంచి నేరుగా కాకుండా డాక్యుమెంట్ల రూపంలో షేర్ చేయాలి. అయితే కొత్త ఫీచర్తో ఇకపై అలా ఉండదు.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్ స్టేజీలోనే ఉంది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు..


