ఒకవైపు వణికిస్తున్న చలి.. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, చలి తీవ్రత!

Must read

  • తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..
  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
  • ఈ జిల్లాల్లో వర్షాలు, చలి తీవ్రత
  • వాతావరణ శాఖ కీలక అంచనా

ఇప్పటికే దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి..

తెలంగాణలో చలి పంజా..
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు కూడా కనిపిస్తోంది.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజులు చలి, పొగమంచు, వర్షాలతో సాగనున్నాయి. ప్రయాణాలు చేసేవారు, ఉదయం బయటకు వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!