- చలికి గజగజ.. తెలంగాణలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు
- పొద్దున్నే పొగమంచు.. రాత్రికి గజగజ వణుకు
- 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు
పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు :
చలి తీవ్రతకు తోడు తెల్లవారుజామున పొగమంచు కూడా కమ్ముకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. దీంతో వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
ఆదిలాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రత :
రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్లో అత్యల్పంగా 14.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్లో 16.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటమే చలి పెరగడానికి ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి మరో 3 రోజులు తెలంగాణలో చలి ప్రభావం కొనసాగనుంది. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది..


