పెన్షనర్లకు భారీ ఊరట.. ఇకపై నెలకు రూ.1,000 కాదు.. రూ.3 వేల పింఛను?

Must read

  • 73 లక్షల మందికి లబ్ధి.. కనీస పింఛనుపై కీలక నిర్ణయం
  • ఈపీఎస్ పింఛను మూడు రెట్లు పెరిగే ఛాన్స్
  • పింఛనుదారుల ఎదురుచూపులకు తెరపడనుందా?

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పింఛనుదారులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం దేశంలో సుమారు 81.48 లక్షల మంది ఈపీఎస్ పింఛనుదారులు ఉండగా.. వీరిలో దాదాపు 73.55 లక్షల మందికి నెలకు రూ.3వేల కన్నా తక్కువ పింఛను వస్తోంది. అంటే.. ఎక్కువ మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఈ పెంపుతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

19నే సీబీటీ సమావేశం :
ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో కార్మికశాఖ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.. అయితే, పింఛను పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..

వాస్తవానికి.. 2014లో కనీస పింఛనును రూ.1,000గా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 ఏళ్లు గడిచినా అదే మొత్తం కొనసాగుతోంది. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులతో ఈ మొత్తం సరిపోవడం లేదని పింఛనుదారులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు..

5 లక్షల మంది పింఛనుదారులకు బెనిఫిట్ :
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. సుమారు 5 లక్షల మంది పింఛనుదారులకు ఈ నిర్ణయంతో భారీ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరి చూపు ఈపీఎఫ్‌వో సమావేశంపైనే ఉంది. రూ.3వేలు పింఛను ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందా? లక్షలాది మంది ఎదురుచూపులకు తెరపడుతుందా? అనేది అతి త్వరలో తేలిపోనుంది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!