- ఐటీ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లకు గుడ్ న్యూస్..
- పార్కుల్లోనే వర్క్ ఫ్రమ్ పార్క్ ట్రెండ్
- హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం
- సైబరాబాద్‌లో 40 పార్కుల అభివృద్ధి
2027 జనవరి 1 నాటికి అందుబాటులోకి :
మొదటి వర్క్‌స్పేస్‌ను మసీద్ బండాలోని మాధవ హిల్స్ కాలనీ పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో కొంత భాగాన్ని పని చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. మరో సెంటర్ మాదాపూర్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు పైలట్ ప్రాజెక్టులను 2027 జనవరి 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు..
ఇక్కడ ఫ్రీ వై-ఫై, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు, కంపర్టబుల్ కుర్చీలు, వర్క్‌స్టేషన్లు, కో-వర్కింగ్ సదుపాయాలు ఉండనున్నాయి. అంతేకాదు.. కాఫీ, స్నాక్స్ కియోస్కులు, వాకింగ్ ట్రాక్స్, పార్కింగ్, సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
రూ. 50 నుంచి రూ. 100 వరకు ఛార్జీ :
ఈ సదుపాయాలను వినియోగించుకుని వారి నుంచి ఒక్కొక్కరికి రూ.50 నుంచి రూ.100 వరకు నామమాత్రపు రుసుము వసూలు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు..
ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని పార్కులకు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే 300 కొత్త పార్కుల అభివృద్ధి, పాత పార్కుల ఆధునికీకరణపై దృష్టి పెట్టిన అధికారులు.. నగరంలో పచ్చదనాన్ని పెంచడంతో పాటు ప్రజలకు కొత్త పని వాతావరణాన్ని అందించాలని భావిస్తున్నారు.. మొత్తానికి ఆఫీస్ గోడల మధ్య కాకుండా ప్రకృతి ఒడిలో పని చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట..


