కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.40 వేల క్యాన్సర్ మందులు ఇక రూ.2,720కే.. రోగులకు భారీ ఊరట!

Must read

  • క్యాన్సర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..
  • క్యాన్సర్ మందుల ధరలు దొగొచ్చాయ్
  • వేల రూపాయల భారం తగ్గించిన కేంద్రం
  • 679 బ్రాండ్ల ధరలు భారీగా డౌన్

రూ.2,720కే క్యాన్సర్ మందులు :
ధరల తగ్గింపు ఎంత భారీగా ఉందో కొన్ని మందుల ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది.. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పాల్బోసిక్లబ్ క్యాప్సూల్స్ ప్యాక్ ధర గతంలో రూ.40,421 ఉండగా.. ఇప్పుడు రూ.2,720కే అందుబాటులోకి వచ్చింది.

ప్రోస్టేట్ క్యాన్సర్ మెడిషన్ అబిరాటెరోన్ ధర కూడా రూ.41,250 నుంచి రూ.3,218కి తగ్గింది. ఇతర క్యాన్సర్ మందుల ధరలు కూడా గణనీయంగా దిగివచ్చాయి. ఈ మార్పుతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఏడాదికి సుమారు రూ.3,540 కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

పాత స్టాక్‌ కూడా కొత్త ధరలకే.. :
అయితే ధరలు తగ్గాయని మందుల సరఫరా తగ్గించకూడదని, కృత్రిమ కొరత సృష్టించకూడదని కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాత స్టాక్‌ను కూడా కొత్త ధరలకే విక్రయించాలని మెడికల్ షాపులకు సూచించింది..

మందులను ఎక్కువ ధరకు అమ్మితే ఫార్మా సహీ దామ్ యాప్ లేదా NPPA వెబ్‌సైట్‌లో ధరలు చెక్ చేసుకోవచ్చు.. అధిక ధరలు వసూలు చేస్తే.. 1800-111-255 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కష్టకాలంలో ఉన్న క్యాన్సర్ బాధిత కుటుంబాలకు ఈ నిర్ణయం నిజంగా పెద్ద ఊరట అనే చెప్పాలి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!