బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన.. వాతావరణ కేంద్రం కీలక నివేదిక!

Must read

Ap Rain Alert: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి వాయువ్య ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా, ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో అత్యల్పంగా 14.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతంలో నూతన అల్పపీడనం.. ఏపీలో 18, 19 తేదీల్లో వర్షాలు:

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న నూతన అల్పపీడనం(Ap Rain Alert) ఏర్పడి, పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇది ఈ నెల 18 లేదా 19 నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరువయ్యే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే మురసు వంటి తుఫాన్లతో తీవ్ర పంట నష్టపోయిన రైతన్నలు ఈ వర్షాల వార్తతో ఆందోళన చెందుతున్నారు.

14, 15 తేదీల్లో సముద్రం తీవ్ర అల్లకల్లోలం.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశం:

ఈ అల్పపీడన వ్యవస్థ బలోపేతమయ్యే క్రమంలో ఈ నెల 14, 15 తేదీల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి విపరీతంగా పెరగనుందని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!