- తక్కువ ధరకే ఇంట్లో క్లీన్ ఎయిర్ ఇచ్చే ప్యూరిఫైయర్లు
- రూ.6,999 నుంచే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనేసుకోవచ్చు
- బెడ్‌రూమ్‌లో క్లీన్ ఎయిర్ కావాలా? 6 ఎయిర్ ప్యూరిఫైయర్లు
- HEPA ఫిల్టర్, Wi-Fi కనెక్టివిటీతో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు
Top 6 Smart Air Purifiers : అసలే పండగ సీజన్.. దీపావళికి టపాసుల మోత మోగిపోయింది.. ఇప్పటికే వాయు కాలుష్యంతో ఇబ్బందిపడుతుంటే ఈ టాపాసుల కారణంగా మరింతగా వాయు కాల్యుషాన్ని పెంచింది.. స్వచ్ఛమైన గాలి దొరికే పరిస్థితి లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్తేనే వాయు కాలుష్యం అనుకుంటున్నారా?
ఇంట్లో ఉన్నా స్వచ్ఛమైన గాలి అందుతుందన్న గ్యారెంటీ లేదు. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఇండోర్ ఎయిర్ క్వాలిటీపై కూడా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది..
నవంబర్ 9, 2026న ఢిల్లీ ఏక్యూఐ 372కి చేరి ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదైంది. జీఆర్ఏపీ స్టేజ్-3 ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. చాలామంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు.
అయితే, మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.10 వేల లోపే హెచ్ఈపీఏ ఫిల్టర్లు, మొబైల్ యాప్ కంట్రోల్, మల్టీ లేయర్ ఫిల్ట్రేషన్ వంటి ఫీచర్లతో కొన్ని మంచి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి..
బడ్జెట్‌లో టాప్ 6 మోడల్స్ ఇవే :
యురేకా ఫోర్బ్స్ ఏరోగార్డ్ 400జీ : సుమారు 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి సరిపోతుంది. ట్రూ హెచ్ఈపీఏ హెచ్13, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, వై-ఫై కనెక్టివిటీతో వస్తుంది. ధర రూ.9,999 అందిస్తుంది.
షావోమీ మిజియా స్మార్ట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్ 4 కంపాక్ట్ 400 చదరపు అడుగుల వరకు కవరేజ్ అందిస్తుంది.. 230 CADR, స్లీప్ మోడ్‌లో 20dB సౌండ్ ప్రత్యేకత. ధర రూ.6,999కు లభిస్తుంది.
క్యూబో క్యూ450 : 450 చదరపు అడుగుల కవరేజ్ అందిస్తుంది. 300 CADR, 5-in-1 ఫిల్ట్రేషన్, యాప్ కంట్రోల్‌తో వస్తుంది. ధర రూ.9,990 మాత్రమే
క్యూబో క్యూ200 : చిన్న బెడ్‌రూమ్‌లకు సరైన మోడల్. 200 చదరపు అడుగుల కవరేజ్ అందిస్తుంది. 150 CADRతో వస్తుంది. ధర రూ.6,990కు లభిస్తుంది
షావోమీ స్మార్ట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్ 4 లైట్ : 463 చదరపు అడుగుల కవరేజ్ అందిస్తుంది. 360 CADR, HEPA ఫిల్టర్‌తో వస్తుంది. ధర రూ.10,999 మాత్రమే
ఫిలిఫ్స్ ఏసీ0950 : 320 చదరపు అడుగుల కవరేజ్ అందిస్తుంది. 250 CADR, HEPA నానో ప్రొటెక్ట్ ఫిల్టర్, Wi-Fi సపోర్ట్ ఉన్నాయి. ధర రూ.11,995కు లభిస్తుంది.
కొనేముందు ఇవి మర్చిపోవద్దు :
ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు కేవలం ధర, బ్రాండ్ మాత్రమే చూడకూడదు. మీ రూమ్ విస్తీర్ణానికి సరిపోయే CADR ఉందా? ఫిల్టర్లు మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? స్లీప్ మోడ్‌లో సౌండ్ ఎంత ఉంటుంది? యాప్ కంట్రోల్ అందుబాటులో ఉందా? వంటి విషయాలు తప్పనిసరిగా చెక్ చేయాలి.. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో ఎక్కువసేపు గడిపేవారు ఇవి తప్పక పాటించాలి..
మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ గదిలోని గాలిలో కాలుష్య కణాలను తగ్గిస్తుంది. అయితే, బయట నుంచి వచ్చే కాలుష్యాన్ని పూర్తిగా అడ్డుకోలేదు. ధరలు, ఆఫర్లు మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం బెటర్..


