తాజాగా సీన్ సినిమా ప్రమోషన్స్ లో సూర్యకు రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైంది. దాంతో సూర్య స్పందిస్తూ.. నేను రాజకీయాల్లోకి రావట్లేదు. అలా అని రాజకీయాలంటే నాకు ద్వేషం లేదు. కానీ నేను రాజకీయాలను నిశ్శబ్దంగా గమనిస్తున్నాను. యువత రాజకీయాలపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. రాజకీయ నాయకులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పూర్తి అంకితభావంతో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. నాకు సరైన మార్గం తెలియకపోయినా నేను రాజకీయాల్లోకి మాత్రం రాను అని అన్నారు. దీంతో సూర్య రాజకీయాల్లోకి రాను అని క్లారిటీ ఇచ్చేసారు.
పాలిటిక్స్ లోకి ఎంట్రీ పై స్పందించిన సూర్య.. రాజకీయాలు గమనిస్తున్నాను అంటూ..


