రైల్లో ఆకలేస్తే ఏ యాప్ పడితే ఆ యాప్ వాడొద్దు.. IRCTC బిగ్ వార్నింగ్.. ఫుడ్ ఆర్డర్ చేస్తే జాగ్రత్త..!

Must read

  • ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
  • ప్రయాణికులకు IRCTC కీలక హెచ్చరిక
  • రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఇది తెలుసుకోండి..

మరి సురక్షితంగా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే? :
ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారిక (e-Catering) వెబ్‌సైట్, ఫుడ్ ఆన్ ట్రాక్ మొబైల్ యాప్, అధికారికంగా గుర్తింపు పొందిన పార్టనర్ల ద్వారా మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలని సూచించింది. అలాగే 1323 హెల్ప్‌లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. రైల్వే స్టేషన్లలో లేదా రైళ్లలో అనధికారికంగా ఆహారం విక్రయిస్తున్నట్లు కనిపిస్తే (RPF) హెల్ప్‌లైన్ 182కు ఫిర్యాదు చేయాలని కోరింది..

ఐఆర్‌సీటీసీ ఆథరైజడ్ ఫుడ్ అగ్రిగేటర్లు :

1 Zomato
2 Swiggy
3 Zoop
4 Rail yatri
5 Rail recipe
6 Yatribhojan
7 Yatrirestro
8 Garg Rajdhani
9 Homebytes
10 OLF
11 Relfood
12 Gofoodieonline
13 Rajbhog
14 BrotherByte
15 Happy Journey
16 Swad Express

రైల్వే ప్రయాణీకులు ఇలా తమకు ఇష్టమైన ఫుడ్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు..

IRCTC ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్ : డెస్క్‌టాప్ లేదా మొబైల్ బ్రౌజర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ (http://www.ecatering.irctc.co.in)ని విజిట్ చేయండి.
ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ : గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి అధికారిక ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
హెల్ప్‌లైన్ 1323 : ఆర్డర్ ఇవ్వడానికి ముందే IRCTC ఇ-క్యాటరింగ్ కస్టమర్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయండి.
అధీకృత పార్టనర్లు : ప్రయాణికులు IRCTC-అధీకృత ఇ-క్యాటరింగ్ పార్టనర్ల ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!