భారత్-న్యూజిలాండ్ మూడో వ‌న్డే మ్యాచ్‌కు వర్షం ముప్పు!

Must read

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌కు వరుణుడు మరోసారి ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆక్లాండ్, వెల్లింగ్టన్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేలకు వర్షం అంతరాయం క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌ మంగళవారం (న‌వంబ‌ర్ 10న‌) హామిల్టన్ వేదికగా జరగనున్న మూడోకు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది.

హామిల్ట‌న్‌లో ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమ‌వారం భారత ఆట‌గాళ్ల ఔట్ డోర్ ప్రాక్టీస్ మ‌ధ్య‌లోనే నిలిచిపోయింది. దీంతో ప్లేయ‌ర్లు ఇండోర్‌లో ప్రాక్టీస్ చేసుకోవాల్సి వ‌చ్చింది.

మ్యాచ్ రోజంతా వర్షం!

AccuWeather ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 1 గంట వరకు హామిల్టన్‌లో భారీ వర్ష సూచన (Heavy Rain Watch) జారీ చేశారు. మంగళవారం వర్షం కురిసే అవకాశం ఏకంగా 100 శాతంగా ఉండగా.. పగటిపూట 99 శాతం, రాత్రి వేళల్లో 90 శాతంగా ఉంది.

గంటల వారీగా వాతావరణ అంచనాలను పరిశీలిస్తే.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్షం పడే అవకాశాలు 71 నుంచి 89 శాతం మధ్య ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి కూడా వర్షం ముప్పు 73 శాతంగా ఉంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు వర్షం పడే అవకాశం 80 శాతానికి చేరనుంది. రాత్రి 8 గంటలకు మాత్రం ఇది 49 శాతానికి తగ్గనుంది.

అయితే ఆ తర్వాత కూడా వర్షం ముప్పు పూర్తిగా తొలగిపోయే సూచనలు లేవు. రాత్రి 9 గంటలకు 70 శాతం, 10 గంటలకు 76 శాతం, 11 గంటలకు 67 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులను బట్టి చూస్తే మ్యాచ్ ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతో పాటు, ఆట మధ్యలో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది.

తొలి రెండు వ‌న్డేల్లో గెలిచిన భార‌త్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్ర‌స్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. హామిల్ట‌న్‌లోనూ విజ‌యం సాధించి మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సిరీస్ సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు మూడో వ‌న్డేలో గెలిచి భార‌త ఆధిక్యాన్ని త‌గ్గించాల‌ని న్యూజిలాండ్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!