- లీటర్ పెట్రోల్‌తో ఎక్కువ మైలేజీ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్..
- తక్కువ ధరలో సెల్ఫ్ స్టార్ట్ బైక్.. హీరో HF డీలక్స్‌పై అదిరిపోయే ఆఫర్లు
- ఫ్లిప్‌కార్ట్‌లో హీరో HF డీలక్స్ 2026 బుకింగ్స్.. SBI కార్డుపై భారీ డిస్కౌంట్
ఇంజిన్, పర్ఫార్మెన్స్ ఇలా :
ఈ బైక్‌లో 97.2cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. 7.91bhp టాప్ పవర్, 8.05Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, 4-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. సెల్ఫ్ స్టార్ట్ సదుపాయం ఉంది. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు మైలేజీ అందిస్తుంది.
ఇతర ఫీచర్లు ఇవే :
ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు వైపులా డ్రమ్ బ్రేకులు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. అల్లాయ్ వీల్స్, ట్యూబ్ టైర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు..
మొత్తంగా తక్కువ బడ్జెట్లో రోజువారీ ప్రయాణాల కోసం బైక్ కొనాలనుకునేవారికి హెచ్ఎఫ్ డీలక్స్ అద్భుతమైన ఆప్షన్.. కొనుగోలు చేసే ముందు మైలేజీ, ఆన్-రోడ్ ధర, లోకల్ డీలర్ ఆఫర్లను తెలుసుకోవడం బెటర్..


