- 13MP కెమెరా, 6500mAh బ్యాటరీతో కొత్త వివో Y6k ఫోన్
- 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్, 6500mAh బ్యాటరీ సెటప్
- తక్కువ బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లు..
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో 6GB వరకు ర్యామ్, 128GB వరకు స్టోరేజ్ అందిస్తుంది..
6500mAh బ్యాటరీ.. 13MP కెమెరా :
ఈ ఫోన్లో మెయిన్ అట్రాక్షన్.. 6500mAh భారీ బ్యాటరీ. 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఐదేళ్ల వరకు పనిచేసేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP కెమెరా అమర్చారు..
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉంది. ఇక 5జీ, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సి, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP65 రేటింగ్ కూడా అందించారు..
మొత్తానికి భారీ బ్యాటరీ, మంచి డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి వివో Y6k అద్భుతమైన ఆప్షన్.. అయితే, భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుంది అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


