WPL 2027 : మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ వచ్చేసింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. మొత్తం 22 మ్యాచ్‌లను రెండు నగరాలలో నిర్వహించనున్నారు. వడోదర, ముంబైలలో 11 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జనవరి 14న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ప్రారంభం కానుంది.
వడోదరలోని మ్యాచ్‌లు కోటంబిలోని కొత్త బీసీఏ స్టేడియంలో జరగనున్నాయి. ముంబైలోని ప్లేఆఫ్స్, ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతాయి. మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
డబ్ల్యూపీఎల్ 2027 పూర్తి షెడ్యూల్ ఇదే..
* జనవరి 14 – RCB vs MI – వడోదర
* జనవరి 15 – GG vs UPW – వడోదర
* జనవరి 16 – DC vs RCB – వడోదర
* జనవరి 17 – UPW vs MI – వడోదర
* జనవరి 18 – GG vs DC – వడోదర
* జనవరి 19 – RCB vs UPW – వడోదర
* జనవరి 20 – GG vs MI – వడోదర
* జనవరి 21 – UPW vs DC – వడోదర
* జనవరి 22 – GG vs RCB – వడోదర
* జనవరి 23 – DC vs MI – వడోదర
* జనవరి 24 – UPW vs GG – వడోదర
* జనవరి 26 – MI vs RCB – ముంబై
* జనవరి 27 – DC vs GG – ముంబై
* జనవరి 28 – MI vs UPW – ముంబై
* జనవరి 29 – RCB vs DC – ముంబై
* జనవరి 30 – MI vs GG – ముంబై
* జనవరి 31 – UPW vs RCB – ముంబై
* ఫిబ్రవరి 1 – MI vs DC – ముంబై
* ఫిబ్రవరి 2 – RCB vs GG – ముంబై
* ఫిబ్రవరి 3 – DC vs UPW – ముంబై
* ఫిబ్రవరి 5 – ఎలిమినేటర్ – ముంబై
* ఫిబ్రవరి 7 – ఫైనల్ – ముంబై


